‘అరణ్య’ సినిమా ఫలితం, వసూళ్లు అవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒకసారి సినిమా కోసం దర్శకుడు, హీరో పడిన కష్టం గురించి మాట్లాడుకోవాలి. అడవుల్లోకి వెళ్లి, అక్కడ జీవనాన్ని, పరిస్థితుల్ని చూపించడం ఏమంత సులభం కాదు. అయినప్పటికీ అలాంటి కథను తెలుగు ప్రేక్షకులకు, ఆ మాటకొస్తే మొత్తం పాన్ ఇండియా ప్రేక్షకులకు అందించాలని దర్శకుడు ప్రభు సాల్మన్, హీరో రానా నిర్ణయించుకున్నారు. అందుకుతగ్గట్టుగానే కష్టపడి సినిమా తీసిన ప్రేక్షకులకు అందించారు. మరి ఆ క్రమంలో ఏం జరిగిందో ప్రభు సాల్మన్ ఇటీవల చెప్పుకొచ్చారు.
అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారిని అడ్డుగా అక్కడి ప్రభుత్వం గోడకట్టిన సంఘటన ఆధారంగా ‘అరణ్య’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అలాంటి ప్రదేశంలో పర్యావరణ పోరాట యోధుడు ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ప్రభుకి వచ్చిందట. అదే సమయంలో అసోంలో సొంతంగా అడవిని పెంచిన జాదవ్ పాయెంగ్ కనిపించారట. ఆయన స్ఫూర్తితోనే ‘అరణ్య’లో హీరో పాత్రని రాసుకున్నారు ప్రభు సాల్మన్. ఆ పాత్ర కోసం చాలామందిని అనుకున్నా… రానా పేరు చెప్పగానే ‘అరె… ఇంతకాలం ఆయనెందుకు తట్టలేదు!’ అనిపించిందట. అలా హైదరాబాద్ వచ్చి కథ చెప్పి, రానాని, సురేశ్‌బాబును ఒప్పించారు ప్రభు.
‘అరణ్య’ కోసం మూడేళ్లపాటు మరే సినిమాలోనూ పనిచేయకుండా రానా శ్రమించిన విషయం తెలిసిందే. శాకాహారం మాత్రమే తింటూ 15 కేజీల బరువు తగ్గారు. సినిమా స్క్రిప్టులో ఏనుగుల సంచారాన్ని అడ్డుకోవడానికి కట్టిన గోడని కూల్చేసినట్టుగా క్లైమాక్స్ రాశారు. అప్పుడు అది ఆ కోరిక మాత్రమే. అప్పటికి నిజంగా గోడ కట్టలేదు. కానీ, సినిమా విడుదల కావడానికి వారం ముందు ఆ గోడని కూల్చేశారట. తిరిగి ఆ ఏనుగుల రాచబాటని పునరుద్ధరించారట. ‘మీ స్క్రిప్టు ఆ ఏనుగుల పాలిట ఓ ప్రార్థనలా పనిచేసిందండీ!’ అక్కడి అటవీ అధికారులు ప్రభు సాల్మన్‌కు చెప్పారట.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!