బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి హీరోలు రావడం కామన్. పాన్ ఇండియా పేరుతో అక్కడి నాయికల్ని.. ఇకడ నాయకులతో కలుపుతున్నారు మన దర్శకనిర్మాతలు. అయితే మధ్యలో మన నాయికల కూడా బాలీవుడ్‌కి వెళ్తున్నారు. రీసెండ్ డేస్‌లో అయితే రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. రష్మిక రెండు సినిమాలు ఓకే చేసుకుంది. పూజా హెగ్డే అయితే అక్కడ, ఇక్కడా సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా మరో హీరోయిన్ బాలీవుడ్‌కి వెళ్తోంది. ఆమెనే ప్రగ్యా జైస్వాల్. అందులోనూ ఓ సూపర్‌స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిందట.
తెలుగులో చాలా రోజులుగా సరైన సినిమాలు లేని ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ ఛాన్స్ సాధించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిందట. సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘అంతిమ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. అందులో ఓ హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో ఇప్పటికే మహిమ మక్వానను ఓ హీరోయిన్గా ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఎవరి సరసన అనేది తెలియాల్సి ఉంది. అయితే సల్మాన్ సరననే నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.
‘అంతిమ్’ టీజర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ ఫుల్ బాడీ ట్రాన్స్ఫామ్తో మాస్ హీరో లెక్కన కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాబలేశ్వర్ లో సాగుతోన్న తాజా షెడ్యూల్లో ప్రగ్య పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మరాఠీలో 2018లో విడుదలైన ముల్సీ ప్యాట్రన్‌ను రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మాతృక మరాఠీలో మంచి విజయం సాధించడం గమనార్హం.