Prakash Raj: తెలుగోడిగా పుట్టకపోవడం నా తప్పు కాదు: ప్రకాష్ రాజ్
October 11, 2021 / 11:55 AM IST
|Follow Us
‘మా’ ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం నాడు జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య రసవత్తరంగా సాగింది. కానీ ఫైనల్ గా పదవి మంచు విష్ణుకే దక్కింది. విష్ణు విజయం సాధించిన తరువాత ప్రకాష్ రాజ్ మీడియాతో నేరుగా మాట్లాడలేదు. విష్ణు విజయాన్ని స్వాగతిస్తూ.. ‘తెలుగు బిడ్డ గెలిచాడు.. 650 మంది తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా.. మంచు విష్ణుకి ఆల్ ది బెస్ట్’ అనిచెప్పారు .
తాజాగా ప్రకాష్ రాజ్ సోమవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేనంత చైతన్యంతో 650 మంచి సభ్యులు ‘మా’ ఎన్నికల్లో పాల్గొన్నారని.. ఎన్నికల్లో విజయం సాధించిన విష్ణు, శివ బాలాజీ, రఘుబాబు ఇలా ప్రతీ ఒక్కరికీ అభినందనలు చెప్పారు. తను తెలుగోడిని కాదని.. ప్రాంతీయత, జాతీయవాదం నేపథ్యంలో ఎన్నికలు జరిగాయని.. బైలాస్ మార్చాలని అన్నారు. తెలుగోడు కాకపోయినా ఓటేయొచ్చు కానీ నిలబడకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ విషయంలో నేనేం చేయాలని.. నా తల్లితండ్రులు తెలుగోళ్లు కాదు.. అది వారి తప్పు కాదు.. నా తప్పు ప్రకాష్ రాజ్ అన్నారు. సభ్యులు ప్రస్తుతం తెలుగు బిడ్డను, మంచివాడిని ఎన్నుకున్నారని.. కానీ కళాకారుడిగా తనకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని.. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.