Prakash Raj: ‘మా’ఎన్నికలు: ప్రకాశ్‌రాజ్‌ కాంట్రవర్సియల్‌ కామెంట్లు

  • September 15, 2021 / 02:10 PM IST

మాటలు అనడం, చేతలు చేయడం… తర్వాత నాలిక కరుచుకోవడం, ఇబ్బందులు పడటం. సినిమాల్లో నటుడిగా ప్రకాశ్‌రాజ్‌ కెరీర్‌ మొదలైన కొత్తలో చూశాం. దాని వల్ల నిషేధం కూడా ఎదుర్కొన్నారాయన. మనసు నొప్పించే మాటలు కావడంతో కొన్నిసార్లు సీరియస్‌ గా తీసుకుంటుంటారు. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ అలాంటి కొన్ని మాటలు మాట్లాడారు. ‘మా’ ఎన్నికలు జరుగుతున్న తీరు గురించి ఆయన ఆ మాటలు అన్నారు. అయితే అవి ఫ్లోలో వచ్చాయా? మనసులోని మాటలా అనేది తెలియాలి.

‘మా’లో 900 మంది సభ్యులు ఉన్నా… అసోసియేషన్‌ సేవలు అవసరమయ్యేది 250 మంది అంటూ చెప్పుకొచ్చారయన. ఈ క్రమంలో గతంలో జరిగిన ఎన్నికల్లో జరిగిన ఓటింగ్‌, నటుల వ్యవహారశైలి గురించి కూడా మాట్లాడారు. అప్పుడే ప్రకాశ్‌ రాజ్‌ ‘రామ్‌చరణ్‌, నాగచైతన్య లాంటి యువ హీరోలు… ఓటు వేయడానికి రారు. వాళ్లకు అవసరం లేదు’ అని ఉదాహరణగా చెప్పారు ప్రకాశ్‌రాజ్‌. ఇప్పుడు ఆ మాటలే అభిమానుల చర్చకు దారి తీస్తున్నాయి.

యువ హీరోలు ‘మా’ ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు అని ప్రకాశ్‌రాజ్‌ కావాలనే ఆ మాట అన్నారా? లేక ఉదాహరణకు పేర్లు చెప్పాలి కాబట్టి…. తన నోటికి వచ్చిన పేర్లు చెప్పారా? అనేది మనకు తెలియదు కానీ, ఆయన నోటి నుండి అయితే ఆ మాటలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఓట్లు వేయడానికి యువ హీరోలు దూరంగా ఉంటారా… లేక ముందుకొస్తారా అనేది చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus