మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, విష్ణు ప్యానల్ సభ్యులు ఎన్నికలకు ముందు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సీసీ టీవీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ను కోరారు. అయితే కృష్ణమోహన్ మాత్రం సీసీ టీవీ ఫుటేజీని ఇవ్వలేమని వెల్లడించారు. అయితే నటుడు ప్రకాష్ రాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను సీజ్ చేశారని ప్రచారం జరుగుతుండగా ప్రకాష్ రాజ్ ఫిర్యాదు చేశారో లేదో తెలియాల్సి ఉంది.
ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ యొక్క సర్వర్ రూమ్ కు పోలీసులు తాళం వేయడం గమనార్హం. పోలీసుల ఎంట్రీతో ఈ వివాదంలో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. పోలింగ్ రోజున మోహన్ బాబు, వీకే నరేష్, ఇతరులు తమపై దాడి చేశారని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపణలు చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు పేర్కొన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం కోర్టుకు చేరే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ సీసీ ఫుటేజ్ గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదం వల్ల విష్ణు ప్యానల్ సభ్యులు గెలిచినా సంతోషంగా లేరు. ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగితే మాత్రమే సమస్యలు పరిష్కారం అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
Most Recommended Video
మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!