టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త అయిన నితిన్ రాజును సీక్రెట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాకయ్యారనే చెప్పాలి. ఇలా అకస్మాత్తుగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ ఆమె ఓ లేఖను కూడా విదుడల చేసింది.అందులో ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నందుకు క్షమించాలని ఆమె అభిమానులను కోరింది. అయితే తాజాగా ప్రణీత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది.
ప్రణీత మాట్లాడుతూ.. “కరోనా పరిస్థితులు, ఆషాడం వంటి వాటి వల్ల నా పెళ్లి నిరాడంబరంగా జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ట్రెడిషనల్ గా ఉంటారు. అలాగే వాళ్లకు సెంటిమెంట్లు కూడా ఎక్కువే..! అన్ని సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఆషాడ మాసం వచ్చేస్తుండడం.. తర్వాత మంచి ముహుర్తాలు లేవనే అపనమ్మకంతో మా ఇరు కటుంబ సభ్యులు పెళ్లిని ఫాస్ట్ గా జరిపించేసారు. నాకు అత్యంత సన్నిహితులను కూడా నా పెళ్ళికి ఆహ్వానించలేకపోయాను.
కొద్ది మంది బంధువుల సమక్షంలోనే కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నా వివాహం జరిగింది” అంటూ ప్రణీత చెప్పుకొచ్చింది. మరి పెళ్ళైన తర్వాత సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్నకు ప్రణీత జవాబిస్తూ.. ‘ప్రస్తుతం నేను కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని అనుకుంటున్నాను. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. రోజులు అంతగా బాలేదు. ఆ దేవుడే డిసైడ్ చేయాలి’ అంటూ చెప్పుకొచ్చింది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?