Prashanth Neel: కేజీఎఫ్2 గురించి ప్రశాంత్ నీల్ అలా అన్నారా?
April 24, 2022 / 06:16 PM IST
|Follow Us
దేశంలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరనే సంగతి తెలిసిందే. ఉగ్రమ్, కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో ప్రశాంత్ నీల్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నారు. కేజీఎఫ్2 సినిమాలో సెకండాఫ్ లోని ఒక్కో సీన్ ఒక్కో ట్రైలర్ లా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులలో కొంతమందికి ఈ సినిమా నచ్చకపోయినా మెజారిటీ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది.
కేజీఎఫ్2 సినిమా వీక్ డేస్ లో, వీకెండ్ లో అంచనాలకు మించి కలెక్షన్లను సాధిస్తోంది. మేకర్స్ కేజీఎఫ్2 ప్రమోషన్స్ విషయంలో కొంతమేర నిర్లక్ష్యంగా వ్యవహరించినా మౌత్ టాక్ వల్ల ఈ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వస్తున్నాయి. కేజీఎఫ్2 సక్సెస్ తో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించాలని కోరుకుంటున్న నటీనటుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
కేజీఎఫ్2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏపీకి చెందిన వ్యక్తి అని మాజీ మంత్రి రఘువీరారెడ్డికి బంధువు అని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతూ ఉండటం గమనార్హం. కేజీఎఫ్1, కేజీఎఫ్2 సక్సెస్ కావడానికి సినిమాలోని మదర్ సెంటిమెంట్ సన్నివేశాలు కారణమనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యశ్ తల్లిగా నటించిన అర్చన జోయిస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమా మదర్ సెంటిమెంట్ మూవీ అని మీకు అనిపించలేదంటే ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పేశారని కామెంట్లు చేశారు.
కేజీఎఫ్ ఛాప్టర్1 లో క్లైమాక్స్ ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు. కేజీఎఫ్ ఛాప్టర్3 సినిమాలో నేను ఉన్నానో లేదో నాకు తెలియదని దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ చెప్పే సమయంలో తన పాత్ర వరకు మాత్రమే చెబుతారని ఆమె కామెంట్లు చేశారు. నేను ఇప్పటివరకు ఏదీ అచీవ్ లేదని ఇప్పటివరకు జరిగింది లక్ వల్లే జరిగిందని ఆమె కామెంట్లు చేశారు. మంచి సినిమాలు చేస్తూ మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలని తన డ్రీమ్ అని అర్చన అన్నారు. తన తల్లీదండ్రులు తన కోసం, తన చెల్లెలి కోసం ఎన్నో త్యాగాలు చేశారని అర్చన వెల్లడించారు.