Prashanth Varma: ‘హను-మాన్’ ట్రైలర్.. హీరోయిన్ ను అందుకే దాచారా..!

  • December 21, 2023 / 11:51 AM IST

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హను-మాన్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా శ్రీమతి చైతన్య సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది. అందులోనూ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాని ట్రోల్ చేయడానికి కూడా ‘హను – మాన్’ ట్రోలర్స్ కి బాగా పనికొచ్చింది.

ఆ రకంగా కూడా ‘హను -మాన్’ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. ఇక తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. అది కూడా ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేసింది అని చెప్పొచ్చు. సినిమా అయితే జనవరి 12 న రిలీజ్ అవుతుంది అని చెప్పారు.మరి ఆ టైంకి రిలీజ్ అవుతుందా లేదా అనేది తర్వాతి సంగతి. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో హీరోయిన్ అమృత అయ్యర్ ఎక్కువగా కనిపించింది లేదు.

దీంతో ఆ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదేమో అనే నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. కానీ ఇన్సైడ్ టాక్ వేరే విధంగా వినిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్రలో ట్విస్ట్ లు ఉంటాయట. అందుకే ఆమె పాత్రని హైడ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రశాంత్ వర్మ గత చిత్రాలు తీసుకున్నా.. ‘అ! ‘ లో కాజల్, ‘కల్కి’ లో అదాశర్మ, నందితా శ్వేతా.., ‘జాంబీ రెడ్డి’ లో హీరోయిన్ ఆనంది..ల పాత్రల్లో ట్విస్టులు ఉంటాయి. సో ‘హను-మాన్’ లో అమృత అయ్యర్ పాత్ర కూడా ఉండబోతుందని ఎక్కువమంది చెబుతున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus