Hanu Man: జపాన్ లో హనుమాన్ మూవీ సంచలనాలు సృష్టించడం ఖాయమా?
July 28, 2024 / 02:43 PM IST
|Follow Us
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ (Hanu Man) మూవీ బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 330 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించింది. హనుమాన్ మూవీ జపాన్ లో త్వరలో విడుదల కానుంది. అక్టోబర్ నెల 4వ తేదీన ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కానుండటం గమనార్హం.
ప్రశాంత్ వర్మ (Prasanth Varma) జపాన్ లో హనుమాన్ మూవీ రిలీజ్ కావడం గురించి స్పందిస్తూ విడుదలైన అన్ని చోట్లా సంచలనం సృష్టించిన హనుమాన్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్ధమైందని అక్టోబర్ 4వ తేదీన జపనీస్ సబ్ టైటిల్ వెర్షన్ రిలీజ్ కానుందని పేర్కొన్నారు. హనుమాన్ మూవీ జపాన్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే మరికొన్ని తెలుగు సినిమాలు సైతం జపాన్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ తో పోలిస్తే ఎనిమిది రెట్ల కలెక్షన్లను సాధించి చిన్న సినిమాలలో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం కొసమెరుపు. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుతుండగా ఈ సినిమా 2026లో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి అనే కథాంశంతో జై హనుమాన్ తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. జై హనుమాన్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. జై హనుమాన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటం గమనార్హం. జై హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.