‘జిఏ2 పిక్చర్స్’ అండ్ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘ప్రతీరోజు పండగే’. ఈ ఏడాది ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టి ప్లాపుల నుండీ బయటపడిన సాయితేజ్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి ఈ చిత్రం చేశాడు. ఇక రాశీ ఖన్నా ఈ చిత్రంలో ‘టిక్ టాక్’ కామెడీ తో బాగా ఎంటర్టైన్ చేసింది. ఈ చిత్రం కథ మొత్తం సత్య రాజ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం మొత్తం క్రెడిట్ రావు రమేష్ కే దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తన కామెడీ టైమింగ్ తో.. ప్రేక్షకుల కడుపు చెక్కలు చేసేస్తాడనే చెప్పాలి. ఇక డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ను సాధించింది.
‘ప్రతీరోజూ పండగే’ ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 3.80 cr |
సీడెడ్ | 1.10 cr |
ఉత్తరాంధ్ర | 1.24 cr |
ఈస్ట్ | 0.69 cr |
వెస్ట్ | 0.52 cr |
కృష్ణా | 0.64 cr |
గుంటూరు | 0.67 cr |
నెల్లూరు | 0.34 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.74 cr |
ఓవర్సీస్ | 1.66 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 11.40 cr (share) |
‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 11.40 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 7 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈరోజు నుండీ మొదలుకాబోతుంది. మరి వీక్ డేస్ లో ఈ చిత్రం ఎంత వరకూ కలెక్ట్ చేస్తుందో చూడాలి.
Click Here to Read Prathi Roju Pandage Movie Review
రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!