Upasana: ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న ఉపాసన కొణిదెల!
March 30, 2022 / 08:00 PM IST
|Follow Us
రాంచరణ్ నటించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలోనూ సందడి చేస్తుంది. దీంతో చరణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నార్త్ లో కూడా చరణ్ నటనకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇదిలా ఉండగా.. రాంచరణ్ ను అభిమానులు అమితంగా ప్రేమించడానికి కారణం అతనిలోని సేవా గుణం అని కూడా చెప్పాలి. తన సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం తపిస్తూ ఉంటారు చరణ్. దీనికి ఆయన సతీమణి ఉపాసన కొణిదెల ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.
సొసైటీకి మాత్రమే కాదు పర్యావరణ హితమైన కార్యక్రమాల్లో కూడా చరణ్ చురుగ్గా పాల్గొనడానికి చరణ్- ఉపాసన ఎప్పుడు ముందుంటారు.హ్యూమన్ లైప్ ను మాత్రమే కాదు వైల్డ్ లైఫ్ ను కూడా కాపాడాలనేది ఉపాసన ఆలోచనగా చరణ్ ఎప్పుడూ చెబుతుంటారు.ఇదిలా ఉండగా.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా ఉపాసన ఎంతో కృషి చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అందుకు గాను ఈమె ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ పురస్కారానికి ఎంపికవ్వడం విశేషం.
2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నారు అని స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ” ఓ గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని భాగం చేసిన మా తాతయ్య, అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుంది. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనేది ఆయన లక్ష్యమే..! అదే నాకు స్ఫూర్తినిచ్చింది” అంటూ ఆమె తెలిపింది.
ఓ పక్క చరణ్ ఆర్ ఆర్ ఆర్ తో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను అలరిస్తుంటే మరో పక్క అతని సతీమణి ఉపాసన తన కెరీర్ లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి.