Prince Twitter Review: శివకార్తికేయన్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అట!

  • October 21, 2022 / 11:02 AM IST

శివకార్తికేయన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన మూవీ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఆల్రెడీ ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా ఆద్యంతం అలరించే విధంగా ఉందట. శివకార్తికేయన్ మార్క్ ఎంటర్టెనర్ మూవీ ఇదని చెబుతున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అన్నీ బాగున్నాయట. సినిమాలో కొన్ని వన్ లైనర్స్ చిరాకు తెప్పించినా, కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నా… శివ కార్తికేయన్ వల్ల అది మేనేజ్ అయిపోయింది అని సినిమా చూసిన జనాలు చెబుతున్నారు.

ఈ దీపావళికి ఫ్యామిలీ ఆడియెన్స్ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే మూవీ ఇదని కూడా వారు చెబుతున్నారు. డాక్టర్, కాలేజ్ డాన్ చిత్రాల తర్వాత ప్రిన్స్ తో శివ కార్తికేయన్ హ్యాట్రిక్ కొట్టాడని కూడా అంతా చెబుతున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus