Kaduva: పృథ్వీరాజ్ సుకుమార్ సినిమాకు దారుణమైన పరిస్థితి
July 9, 2022 / 09:35 PM IST
|Follow Us
సినిమా భారీగా తీయడం ఎంత ముఖ్యమో, దాన్ని అంతే బాగా ప్రచారం చేయడమూ అంతే ముఖ్యం అంటుంటారు. దాంతోపాటు అనుకున్నది అనుకున్నట్లుగా విడుదల చేయగలగాలి. తెలుగు సినిమాల విషయంలో ఈ సమస్య తక్కువ కానీ, ఇతర భాషల్లో రూపొంది మన దగ్గర ‘అదే పేరు’తో వస్తున్న సినిమాలకు ఇబ్బంది ఎదురవుతోంది. తాజాగా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న సినిమా ‘కడువా’. పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ఇది. ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుండి తెలుగు వెర్షన్లోనూ రిలీజ్ చేస్తాం అని చెప్పారు.
అయితే ఏమైందో ఏమో హైదరాబాద్‌లో ఎనిమిదో తేదీన సినిమా విడుదల కాలేదు. కేవలం మలయాళం వెర్షన్ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సాంకేతిక సమస్యల వల్ల తెలుగు వెర్షన్ రాలేదు, 9 నుండి సినిమా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంచుతాం అని చెప్పారు. అయితే శనివారం బుక్‌మైషోలో హైదరాబాద్‌లో చూస్తే కేవలం రెండు థియేటర్లలో మాత్రమే టికెట్లు అమ్ముతున్నారు. విడుదల విషయంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చింది అని చెబుతున్నారు.
ప్రచారంలో విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకు థియేటర్లు, ఓపెనింగ్స్ దొరికేవి అని చెబుతున్నారు. దాంతోపాటు సినిమా పేరు కూడా ఓ కారణం అని చెబుతున్నారు. ‘కడువా’ అనే పేరు కాకుండా తెలుగులో పేరు పెట్టి ఉంటే బాగుండేది అనే మాట కూడా వినిపిస్తోంది. ‘కడువా’ అంటే పులి అని అర్థం. కనీసం ఆ అర్థం వచ్చేలా తెలుగులో వేరే పేరు పెట్టినా బాగుండేది. తెలుగులో ఈ సినిమాకు సరైన స్పందన రాకపోవడానికి ‘కడువా’ టాక్ బయటికి వచ్చేసింది.
ఇదొక రొటీన్ మాస్ ఎంటర్టైనర్ అని, దాంతోపాటు సినిమాలో అంత మేటర్ లేని మలయాళ రివ్యూలు చెప్పేశాయి. దీంతో తెలుగులో సినిమా చూడటానికి జనాలు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో సినిమా విడుదల చేసేటప్పుడు అన్ని చోట్లా ఒకేసారి విడుదలయ్యేలా చూసుకోవాలి. లేదంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. మిగిలిన వాళ్లు కూడా ‘కడువా’ పరిస్థితిని గమనించి, తమ సినిమాల విషయంలో జాగ్రత్తలు పడాలి.