డాన్స్ తో అదరగొట్టిన ప్రియా వారియర్

  • September 22, 2018 / 04:51 AM IST

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క వీడియాతో పాపులర్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె పేరు తెలియని సినీ ప్రేక్షకుడు లేడు. “ఒరు అదర్ లవ్” సినిమాలోని “మాణిక్య మలరాయ పూవి” సాంగ్ లో కన్నుకొట్టి విపరీతమైన ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇప్పుడు అదే సినిమాలోని మరో పాటతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే అప్పటి మాదిరి కన్నుకొట్టడం లాంటివి ఇందులో లేకపోయినా, తనదైన డాన్స్ తో ప్రియా వారియర్ అదరగొట్టింది. షాన్ రహెమాన్ సంగీతం అందించిన ఈ సాంగ్‌లో ప్రియా వారియర్‌తో పాటు రోషన్ కూడా అదిరే స్టెప్పులు వేసాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటికే 23 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టడమే గాక యు ట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. మొత్తానికి మరోసారి ప్రియా మ్యాజిక్ చేసి వార్తల్లో నిలిచింది. కొత్త నటీనటులతో దర్శకుడు ఒమర్ లులు తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 3న రిలీజ్ కావాలి. కానీ ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టు మార్పులు చేస్తున్నారు. ఈ మూవీ మళయాళంలోనే కాకుండా తమిళం, తెలుగులోనూ రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం ఆలోచనలో ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus