Priyamani: ప్రియమణి ముద్దు సీన్లలో నటించకపోవడానికి అసలు కారణమిదేనా?
July 1, 2023 / 03:09 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో ప్రియమణి ఒకరు. ప్రియమణిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇటీవల కస్టడీ సినిమాతో ప్రశంసలు అందుకున్న ప్రియమణి మీడియాతో మాట్లాడుతూ పెళ్లి తర్వాత ముద్దు సీన్లలో నటించడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రియమణి నటించిన జవాన్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. పెళ్లి తర్వాత ముద్దు సీన్లలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నానని ప్రియమణి అన్నారు.
సినిమాలో నాది ఒక రోల్ మాత్రమే అయినా వ్యక్తిగతంగా నేను ఇబ్బందులు పడతానని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి సీన్లలో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రియమణి చెప్పుకొచ్చారు. 2017 సంవత్సరంలో నా మ్యారేజ్ జరిగిందని అప్పటినుంచి అలాంటి సీన్లకు దూరంగా ఉన్నానని ప్రియమణి చెప్పుకొచ్చారు. నేను ఏ సినిమాలో నటించినా నా కుటుంబ సభ్యులు, భర్త తరపు కుటుంబ సభ్యులు ఆ మూవీ చూస్తారని ప్రియమణి కామెంట్లు చేశారు.
అలాంటి సీన్ల వల్ల వాళ్లు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదని ఆమె చెప్పుకొచ్చారు. కొన్ని విషయాలకు సంబంధించి నేను ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటున్నానని ప్రియమణి అన్నారు. ప్రియమణి తీసుకున్న నిర్ణయాన్ని ఇతర నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ప్రియమణి తన టాలెంట్ తో అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ప్రియమణిని చూసి ఇతర హీరోయిన్లు నేర్చుకోవాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రియమణి (Priyamani) రెమ్యునరేషన్ 50 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది. ప్రియమణికి రాబోయే రోజుల్లో కూడా వరుసగా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రియమణి ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్లు ప్రియమణికి ఛాన్సిస్తే ఆమె కెరీర్ మరో రేంజ్ లో ఉండనుందని సొషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
.