Priyamani, Mustafa Raj: ఒక్క ఫొటోతో రూమర్స్ కి ఫుల్ స్టాప్!
November 8, 2021 / 07:24 AM IST
|Follow Us
ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలతో కలిసి నటించిన ప్రియమణి పెళ్లి తరువాత సినిమాలు తగ్గించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ లో ఆమె నటనకు గాను మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాలు అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. మరోపక్క టీవీ షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని 4రోజులుగా ప్రియమణికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఆమె తన భర్త ముస్తాఫా నుంచి దూరంగా ఉంటుందని.. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రియమణి.. ముస్తఫాకు రెండో భార్య. అయితే గతంలో ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియమణితో అతడి వివాహం పెళ్లి చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారం అనంతరం ప్రియమణి-ముస్తఫాల మధ్య గొడవలు వచ్చాయని..
సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రియమణి తన విడాకులకు సంబంధించిన రూమర్స్ కు చెక్ పెట్టింది. దీపావళి సందర్భంగా భర్త ముస్తఫా రాజ్ తో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. భర్తతో నవ్వుతూ తీసుకున్న ఫోటోను షేర్ చేయడంతో.. విడాకుల రూమర్స్ పై ప్రియమణి పరోక్షంగా బదులిచ్చినట్లైంది.