Priyamani: ఆ స్టార్ హీరో ప్రియమణికి ఛాన్స్ ఇస్తారా?
July 16, 2021 / 07:49 PM IST
|Follow Us
ఈ నెల 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో వెంకటేష్, ప్రియమణి కాంబినేషన్ లో తెరకెక్కిన నారప్ప మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ప్రియమణి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రియమణి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
లుక్ టెస్ట్ చేసి తనను సుందరమ్మ పాత్రకు ఎంపిక చేశారని తెలుగులో తాను గ్రామీణ మహిళ పాత్రలో నటించడం ఇదే తొలిసారని ప్రియమణి అన్నారు. తెలుగు నేటివిటీకి తగిన విధంగా కథలో కొన్ని మార్పులు చేశారని ప్రియమణి చెప్పుకొచ్చారు. డైలాగుల విషయంలో వెంకటేష్ తనకు సాయం చేశారని ప్రియమణి తెలిపారు. చిరంజీవితో కలిసి నటించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.
వెంకటేష్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెంకటేష్ సింపుల్ గా అందరినీ నవ్విస్తూ ఉంటారని ప్రియమణి తెలిపారు. అయితే సీన్లలో నటించే సమయంలో మాత్రం వెంకటేష్ సీరియస్ గా నటించారని రానాతో విరాటపర్వం సినిమాను చేయగా ఆ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉందని ప్రియమణి అన్నారు. మూడు పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ప్రస్తుతం మైదాన్ షూటింగ్ లో పాల్గొంటున్నానని ప్రియమణి తెలిపారు. చిరంజీవి సినిమాలో నటించాలని ఆశ పడుతున్న ప్రియమణికి చిరు భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో నటించే అవకాశం దక్కుతుందేమో చూడాల్సి ఉంది.