తన ఇమేజ్ ని వాడుకున్నారంటూ ‘మా’ లో ఫిర్యాదు చేసిన ప్రియమణి
March 14, 2018 / 07:34 AM IST
|Follow Us
పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ప్రియమణి.. తర్వాత అనేక సినిమాల్లో నటించినప్పటికీ క్లిక్ కాలేకపోయింది. దీంతో బుల్లి తెరకి వెళ్లిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఆమె తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా)లో ఫిర్యాదు చేసింది. ఎందుకు ఫిర్యాదు చేసిందో వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల క్రితం ప్రేమ్ ఆర్యన్ అనే దర్శకుడు అంగుళిక సినిమాలో నటించమని ప్రియమణిని కోరారు. 600 వందల సంవత్సరాల క్రితం జరిగిన చారిత్రక కథ కావడంతో ఒప్పుకుంది. ఫోటో షూట్ లో కూడా పాల్గొంది. మధ్యలో కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమా నుంచి బయటికి వచ్చేసింది.
దీంతో చిత్రబృందం వేరొక నటితో సినిమాను కంప్లీట్ చేసింది. కానీ చిత్రబృందం తన ఇమేజెస్‌ను టీజర్లో యూజ్ చేశారని ప్రియమణి మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(మా)కు కంప్లైంట్ చేసింది. సినిమా మేకర్స్‌పై యాక్షన్ తీసుకోవాలని ఆమె ‘మా’ను కోరింది. ప్రియమణి మేనేజర్ హరినాథ్ తాను ‘మా’కు కంప్లైంట్ అందించినట్టు స్పష్టం చేశారు. ‘‘ఆ సినిమాకు ప్రియమణి సైన్ చేసినపుడు వారు ప్రియమణి ఇమేజ్‌తో సినిమా లోగోను తయారు చేశారు. సినిమా నుంచి ఆమె తప్పుకున్నాక కూడా ఆ చిత్రబృందం దానిని అదే టైటిల్ లోగోని వాడుతోంది’’ అని హరినాథ్ తెలిపారు. ఈ విషయంపై మా సభ్యులు విచారణ సాగిస్తున్నారు.