Priyanka Jain: బిగ్ బాస్ విన్నర్స్ నేనే.. శివాజీ జెన్యూన్ కాదు!

  • February 3, 2024 / 10:44 AM IST

బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బుల్లితెర నటి ప్రియాంక జైన్ ఒకరు. ఈమె బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు అయితే బయటకు వచ్చిన తర్వాత తన వ్యక్తిగత విషయాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్లో చాలా విషయాలు ఎడిటింగ్ లో తీసేసారని ఆ విషయాలన్నీ కనుక చూపించి ఉంటే నేనే తప్పకుండా విన్నర్ అయ్యే దానిని అంటూ ఈమె తెలియజేశారు. హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు అందుకే ఇంజక్షన్స్ పిల్స్ కూడా వాడాను అని ఈమె తెలిపారు. నా పనులు నేను చేసుకోలేని పరిస్థితుల్లో హౌస్లో ఉన్న వాళ్లకు పనులు చేసి పెట్టలేదని హైలెట్ చేశారు.

ఒకసారి నాకు ఆరోగ్యం బాగా లేకపోతే రెండు రోటీలు దాచుకున్నాను దానిని హైలెట్ చేసి చూపించారని తెలిపారు. బిగ్ బాస్ హౌస్లో అందరూ 100% పెర్ఫార్మన్స్ ఇస్తే నేను 1000% పెర్ఫార్మెన్స్ ఇచ్చానని వీటన్నింటినీ కనక చూపించి ఉంటే తప్పకుండా నేనే విన్నర్ అయ్యే దానిని తెలిపారు. హౌస్ లో నేను స్ట్రాటజీ ఉపయోగించారని చాలామంది అంటున్నారు నేను ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించలేదని అలా కనుక చేసి ఉంటే టాప్ వరకు వెళ్లే దాన్ని కాదని ఈమె తెలిపారు.

ఇక శివాజీ గారు నేను అబద్ధాలు మాట్లాడుతున్నానని తరచు అనేవారు చేయని తప్పును కూడా ఎత్తి చూపిస్తే నాకు కోపం వచ్చింది. శివాజీ గారిని అర్థం చేసుకొనే ప్రయత్నం చేశానని కావాలనే వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టారని ప్రియాంక తెలిపారు. అందరూ అనుకున్నట్టు శివాజీ గారు కాదని ఆయన ఎప్పుడు మాస్క్ తోనే ఉన్నారు అంటూ ఈ సందర్భంగా ప్రియాంక (Priyanka Jain) చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus