పవన్ గురించి ఈ హీరోయిన్ కు ఇలాంటి అభిప్రాయమా?

  • January 16, 2023 / 04:25 PM IST

సాధారణంగా పవన్ కు జోడీగా ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తారు. పవన్ సినిమాలో నటించే అవకాశాన్ని అస్సలు వదులుకోవడానికి ఇష్టపడరు. అయితే ట్యాక్సీవాలా సినిమాతో పాపులర్ అయిన ప్రియాంక జవాల్కర్ మాత్రం పవన్ సినిమాలో తాను అస్సలు నటించనని షాకింగ్ కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు తాను వీరాభిమానినని ఆమె కామెంట్లు చేస్తున్నారు. పవన్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తాను ఎక్కువసార్లు చూశానని

పవన్ నటించిన ఖుషి సినిమాలోని ప్రతి డైలాగ్ నాకు గుర్తుంటుందని ప్రియాంక జవాల్కర్ చెప్పుకొచ్చారు. పవన్ కు తాను ఫ్యాన్ కావడంతో ఆయనకు ఫ్యాన్ గానే ఉండిపోవాలని నా కోరిక అని ఆమె కామెంట్లు చేశారు. పవన్ సినిమాలో నటించాలని ఎవరైనా ఛాన్స్ ఇచ్చినా ఆ అవకాశాన్ని తాను వదులుకుంటానని ప్రియాంక పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయినప్పటికీ ఆయన సాధారణంగా ఉండటానికి ఇష్టపడతారని ప్రియాంక జవాల్కర్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం ప్రియాంక చిన్న సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. ప్రియాంక రెమ్యునరేషన్ కూడా తక్కువే అయినా దర్శకనిర్మాతలు ఆమెకు ఎక్కువగా అవకాశాలను ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది. ప్రియాంకకు సోషల్ మీడియాలో మాత్రం భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ప్రియాంక నటిగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంది. ప్రియాంక రెమ్యునరేషన్ ప్రస్తుతం అరకోటికి అటూఇటుగా ఉందని సమాచారం.

స్టార్ హీరోలు ప్రియాంకకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక ఎన్టీఆర్, బన్నీ నటనను సైతం ప్రశంసించారు. ప్రియాంక కెరీర్ విషయంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ఆమె కొత్త ప్రాజెక్ట్ ల వివరాలు తెలియాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus