నాని, విక్రమ్ కుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రియా వారియర్

  • January 27, 2019 / 08:40 AM IST

వరల్డ్ వైడ్ మిడ్ నైట్ సెన్సేషన్ ప్రియా వారియర్ ఇప్పుడిప్పుడే తెలుగులో తన క్రేజ్ ను బలపరుచుకుంటోంది. ఇటీవలే తన మలయాళ చిత్రం తెలుగు అనువాద వెర్షన్ అయిన “లవర్స్ డే” ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్ వచ్చి అందర్నీ పలకరించి వెళ్ళిన ప్రియా వారియర్ కు ఇక్కడ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలో కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయానని ప్రియా వారియర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం.. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా విక్రమ్ కుమార్ తెరకెక్కించనున్న ఓ చిత్రంలో అయిదుగురు కథానాయికలు నటించనున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఒక హీరోయిన్ గా మేఘా ఆకాష్ ను ఎంపిక చేసిన విక్రమ్ కుమార్, మరో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకో ముగ్గురు భామలను కూడా వచ్చే నెల లోపు పూర్తి చేసి మార్చి నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో నాని ప్లే బోయ్ రోల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus