Ashwini Dutt: చిన్నజీయర్ పై అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్!

  • March 18, 2022 / 04:08 PM IST

తెలంగాణ ప్రజలు సమ్మక్క, సారలమ్మలను దేవుళ్లుగా భావిస్తారు. అలాంటిది వారిపై చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో ఓ టీవీ షోలో చిన్నజీయర్ మాట్లాడుతూ.. ”సమ్మక్క సారక్క.. వారేమైనా దేవతలా.. బ్రహ్మలోకం నుంచి దిగివచ్చారా.. బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత.. గ్రామదేవత.. అక్కడుండే వాళ్లు చేసుకోనీ, సరే.. చదువుకున్న వాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు.. ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారు తర్వాత..

Click Here To Watch Now

అది వ్యాపారమైపోయింది ఇప్పుడు.. ఎంత అన్యాయం? అది ఒక చెడు.. కావాలనే దీన్ని వ్యాపింపజేస్తున్నారు సమాజంలో” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో తెలంగాణ వ్యాప్తంగా వివాదం చెలరేగింది. ఆదివాసీ గిరిజన సంఘాలంతా ఏకమై చిన్నజీయర్ స్వామిపై చర్యలకు నిరసన బాట పడ్డారు. ఈ వివాదం పెద్దది కావడంతో సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఓ టీవీ డిబేట్ లో చిన్నజీయర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చినజీయర్‌ని వాడు వీడు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

”ఈ చినజీయర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడో పెద్ద వెధవ.. వీడి గురించి సూటిగా చెప్తున్నా.. ఒకప్పుడు వీడు బ్లాక్ టిక్కెట్లు కూడా అమ్మాడనే అభియోగం కూడా వీడిపై ఉంది. వీడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వీడు కనపడిన చోటల్లా బోలెడు డబ్బులు పోగుజేసుకొచ్చాడని.. వాటికి రెస్పాన్సిబిలిటీ ఫేస్ చేయాలని.. దాన్ని ఎలా చేయాలో వాడికి తెలియడం లేదని అన్నారు.

వీళ్ల యూనిట్‌లో మరొకడు ఉన్నాడని.. వాడికి వీడికి కూడా త్వరలో పేచీ వస్తుందని అన్నారు. టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి ఈ యూజ్ లెస్ ఫెలో మాట్లాడిన పిచ్చివాగుడు ఇదని చెప్పుకొచ్చారు. వీడేమో ప్రార్ధనలు చేస్తాడు.. సూక్తులు చెప్తుంటాడు.. అలాంటి వెధవ ఇలా మాట్లాడొచ్చా..? ఇలాంటి దరిద్రుల గురించి ఫ్యూచర్‌లో మనం మాట్లాడుకోకూడదంటూ మండిపడ్డారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus