Aswani Dutt: చిరంజీవి సినిమా ఫ్లాప్ కావడానికి ఆ స్టార్ హీరోయిన్ కారణమా?

  • August 31, 2023 / 05:23 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో జై చిరంజీవ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సమీరారెడ్డి నటించగా మరో హీరోయిన్ గా భూమిక నటించిన సంగతి తెలిసిందే. 2005 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి సమీరారెడ్డి కారణమని అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ వల్లే సమీరారెడ్డిని జై చిరంజీవ సినిమాలో తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. జై చిరంజీవ మిస్ ఫైర్ అయిందని త్రివిక్రమ్ అమెరికాకు రావాల్సి ఉన్నా నువ్వే నువ్వే షూటింగ్ తో బిజీ కావడం వల్ల రాలేదని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. సమీరా రెడ్డిని దృష్టిలో ఉంచుకుని త్రివిక్రమ్ సీన్లు రాశారని ఆయన అన్నారు.

సమీరారెడ్డి చేసిన సీన్లు బాగా రాలేదని (Aswani Dutt) అశ్వనీదత్ కామెంట్లు చేశారు. సమీరారెడ్డి ఐరన్ లెగ్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమా విషయంలో మణిశర్మ మ్యూజిక్ కూడా గత సినిమాల మాదిరిగా హైలెట్ కాలేదని అశ్వనీదత్ వెల్లడించారు. అశ్వనీదత్ కామెంట్ల గురించి సమీరారెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. తెలుగులో సమీరారెడ్డి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

సమీరారెడ్డి పారితోషికం ప్రస్తుతం పరిమితంగా ఉంది. సమీరారెడ్డి ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. ఒక స్టార్ హీరోతో సమీరారెడ్డి ప్రేమలో ఉందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆ హీరో కానీ, సమీరారెడ్డి కానీ ఆ వార్తలను సీరియస్ గా తీసుకోలేదు. సమీరారెడ్డి వయస్సు ప్రస్తుతం 44 సంవత్సరాలు కాగా ఆమె తెలుగులో రీఎంట్రీ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. సమీరారెడ్డిని అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus