Dil Raju: ఇన్నేళ్లు భరించాను.. ఇక ఊరుకోను, దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్.!
January 8, 2024 / 09:22 PM IST
|Follow Us
ఈరోజు ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అనే సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ఇది. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా దిల్ రాజు విచ్చేసారు. ఆయన మైక్ పట్టుకుని ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ కాసేపు ప్రకటించారు. ఆ తర్వాత సంక్రాంతి సినిమాల విషయంలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారానికి గట్టిగా మండిపడ్డారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. “నిన్న ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు నా గురించి చాలా మంచిగా మాట్లాడారు. కానీ కొన్ని మీడియా సంస్థలు… కొన్ని కాదు కేవలం 2 ప్రముఖ మీడియా సంస్థలు ఆయన మాటలను తప్పుగా మార్చి ప్రచారం చేస్తున్నాయి. ఇన్నాళ్లు నాకెందుకులే అని ఊరుకున్నాను. ఇక నుండి ఊరుకోను. తాట తీస్తా..! ‘హనుమాన్’ అనే చిన్న సినిమాకు నేను థియేటర్స్ లేకుండా చేస్తున్నాను అంటున్నారు.
మీకు తెలుసా..? ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి తెలంగాణ ఏరియాల్లో చూసుకుంటే.. మహేష్ బాబు గారి ‘గుంటూరు కారం’ కి ఎక్కువ థియేటర్లు ఇస్తే.. ఆ తర్వాత ‘హనుమాన్’ కే ఎక్కువ థియేటర్లు కేటాయించడం జరిగింది. వెంకటేష్ గారి ‘సైంధవ్’ కి, నాగార్జున గారి ‘నా సామి రంగ’ కి ఎక్కువ థియేటర్స్ లేవు. వాళ్ళు పెద్ద హీరోలే కదా.?! ఆ విషయాలు మీకు తెలీదు.
నేను జనవరి 12 న తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేస్తున్నాను అని రాస్తున్నారు. మీకు ఎవరు చెప్పారు? ఆ సినిమాను నేను పోస్ట్ పోన్ చేయించాను. తెలుసుకొని మాట్లాడండి. నేను ఎంతో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ప్రతి సంక్రాంతికి నన్ను టార్గెట్ చేసి విమర్శించడం మీకు అలవాటు అయిపోయింది. మళ్ళీ చెబుతున్నా.. నా జోలికి వస్తే తాట తీస్తా ” అంటూ ఫైర్ అయ్యారు (Dil Raju) దిల్ రాజు.