విజయ్ సినిమా రిలీజ్ కు పెర్మిషన్ ఇవ్వొద్దంటున్న దర్శకుడు?
June 5, 2020 / 02:16 PM IST
|Follow Us
తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం ‘మాష్టర్’.. ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ.. లాక్ డౌన్ వల్ల నిలిచిపోయింది. ‘ఖైదీ’ దర్శకుడు లోకేష్ కనగరాజన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. దీంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని విజయ్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
థియేటర్ యాజమాన్యం కూడా లాక్ డౌన్ తర్వాత ‘మాష్టర్’ వంటి పెద్ద చిత్రం విడుదల అయితేనే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు. కానీ ఓ సీనియర్ దర్శకుడు అలాగే మాజీ నిర్మాత మండలి అధ్యక్షుడు అయిన కేయార్ మాత్రం.. ఈ చిత్రం విడుదలకు అనుమతులు ఇవ్వకూడదు అంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసాడు. ‘విజయ్ వంటి పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ‘మాష్టర్’ ను విడుదల చేస్తే.. విపరీతంగా జనాలు వస్తారు.
దాంతో క*నా ప్రభావం మరింత విస్తరించే ప్రమాదం ఉంటుంది.జనల క్షేమాన్ని దృష్టిలో కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ‘ఈ చిత్రం విడుదలకు పెర్మిషన్ ఇవ్వొద్దు’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు సినీ నిర్మాతలకు విధించే 26శాతం ట్యాక్స్ ను కూడా మూడు నెలల పాటు మాఫీ చెయ్యాలి అంటూ కోరాడు. మరి కేయార్ రిక్వెస్ట్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.