Nayanthara Remuneration: నయనతార రెమ్యునరేషన్ గురించి ప్రొడ్యూసర్ ఏమన్నారంటే?
October 6, 2022 / 08:49 AM IST
|Follow Us
కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయనతార రెమ్యునరేషన్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారని ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే నయనతార రెమ్యునరేషన్ విషయంలో ప్రవర్తించే తీరుకు సంబంధించి నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవితో నాకు చాలాకాలం నుంచి అనుబంధం ఉందని
ఆయనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా కుదరలేదని ఎన్వీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో రామ్ చరణ్ ఫోన్ చేసి లూసిఫర్ మూవీ నాన్నకు బాగా నచ్చిందని కుదిరితే మీరు హక్కులు కొనుగోలు చేయండి అని చెప్పారని ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు. చరణ్ చెప్పడంతో మేము హక్కులు కొనుగోలు చేశామని ఆయన అన్నారు. అలా ఈ సినిమాకు చరణ్ నన్ను నిర్మాతను చేశారని ఆయన కామెంట్లు చేశారు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి గాడ్ ఫాదర్ మూవీని తెరకెక్కించారని ఎన్వీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
సినిమాలోని మూడు సీన్స్ లో ఫ్యాన్స్ కచ్చితంగా విజిల్స్ వేస్తారని ఎన్వీ ప్రసాద్ కామెంట్లు చేశారు. మోహన్ రాజా వల్లే నయనతార ఈ సినిమాకు ఓకే చేసిందని ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు. ఫైనల్ డే షూట్ కోసం సెప్టెంబర్ లో నయనతార సెట్ కు వచ్చి గంటలో వర్క్ పూర్తి చేసుకుని వెళ్లిపోయారని ఎన్వీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. నయనతారకు అప్పటికే బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉన్నా ఆమె కానీ ఆమె టీమ్ కానీ రెమ్యునరేషన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.
వర్క్ విషయంలో నయనతార చూపించే శ్రద్ధ, క్రమశిక్షణ నాకు నచ్చాయని ఎన్వీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఆమె డబ్బులు కూడా ఇచ్చేశామని ఎన్వీ ప్రసాద్ వెల్లడించారు. ఎన్వీ ప్రసాద్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.