TG Vishwa Prasad: రాజాసాబ్ కోసం ఇండియాలోనే అతిపెద్ద సెట్.. డిలే ఉండదని చెబుతూ?
August 13, 2024 / 01:43 PM IST
|Follow Us
సలార్, కల్కి 2898 ఏడీ భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఫోకస్ అంతా ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాపై ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ప్రభాస్ లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న విశ్వప్రసాద్ (TG Vishwa Prasad)ది రాజాసాబ్ సినిమాకు సంబంధించిన సీక్రెట్స్ ను రివీల్ చేస్తున్నారు. ది రాజాసాబ్ సినిమాకు మారుతి (Maruthi Dasari) దర్శకుడు కాగా ఈ సినిమా కోసం 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చవుతోంది.
TG Vishwa Prasad
మారుతి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న నేపథ్యంలో ది రాజాసాబ్ సినిమాతో మారుతి కచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. హర్రర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ పాత్ర కొత్తగా ఉంటుందని భోగట్టా. విశ్వప్రసాద్ మాట్లాడుతూ ది రాజసాబ్ మూవీ కోసం భారీ సెట్ వేశామని ఇండియన్ సినిమాలో ఇండోర్ లో ఏకంగా 40 వేల చదరపు అడుగుల ఫ్లోర్ లో ఈ సినిమా కోసం సెట్ వేశామని ఆయన అన్నారు.
ఇండియాలో ఈ స్థాయిలో సైజ్ ఫ్లోర్ లేదని ఈ మూవీ కోసం స్పెషల్ గా నిర్మించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ది రాజాసాబ్ సినిమాకు ఈ సెట్ మేజర్ హైలెట్ అవుతుందని విశ్వప్రసాద్ వెల్లడించారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో విడుదలవుతోందని ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని నిర్మాత కామెంట్స్ ద్వారా తెలుస్తోంది.
అక్టోబర్ చివరి నాటికి పాటలు మినహా మిగతా వర్క్ పూర్తి కానుందని సమాచారం. గ్రాఫిక్స్ సన్నివేశాల షూట్ ఇప్పటికే పూర్తైందని క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా గ్రాఫిక్స్ పనులు చేస్తున్నారని తెలుస్తోంది. ది రాజాసాబ్ సినిమాలో పెద్ద కోట ఉంటుందని నిర్మాత పరోక్షంగా ఆ కోట సెట్ గురించే చెప్పారని భోగట్టా.