స్టార్ హీరోల సినిమాలు హిట్ అయితే స్వల్ప లాభాలు, ప్లాప్ అయితే భారీ నష్టాలు ఇది ఇండస్ట్రీ పరిస్థితి. ఏదో ఒక సినిమా భారీ విజయం సాధిస్తే ఇక ప్రతి సినిమాకు అదే ప్రామాణికం చేసుకొని స్టార్ హీరోలు పారితోషికం అడుగుతున్నారు. కేవలం 2% సక్సెస్ రేట్ ఉన్న సినిమా పరిశ్రమలో ఎక్కువ సార్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవడం జరుగుతుంది. ఐనా పారితోషకాల విషయంలో హీరోలు మాత్రం అసలు తగ్గడం. ఇక మహేష్ తీరు మరింత ఘోరంగా ఉందని నిర్మాతలు వాపోతున్నారు.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా పేరున్న మహేష్ ఏకంగా 50కోట్లు డిమాండ్ చేయడం నిర్మాతలకు మింగుడు పడటం లేదు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ లో సగం హీరో రెమ్యూనరేషన్ రూపంలో పోతుంటే సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ సంగతేంది అనేది అసలు విషయం. ఇక తాజా ఉదంతంలో కూడా రెమ్యూనరేషన్ కారణంగా మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమా పక్కన పెట్టడం విచారించదగిన విషయం. దిల్ రాజు సైతం మహేష్ పారితోషికం విషయంలో వెనకడుగు వేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహేష్ ఎంతటి సూపర్ స్టార్ అయినప్పటికీ ప్లాప్ టాక్ వస్తే కనీస వసూళ్లు కూడా రావు. స్పైడర్, బ్రహ్మోతవం చిత్రాల వసూళ్లే నిదర్శనం.
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!