Adipurush: ‘ఆదిపురుష్’ మార్పులపై స్పందించిన నిర్మాత.. నిజమేనా అంటూ ఫ్యాన్స్!
April 25, 2023 / 11:53 AM IST
|Follow Us
‘లీడర్’ సినిమాలో ఓ పెద్దాయన… ‘మాకు నమ్మకం లేదు దొరా?’ అంటారు గుర్తుందా? ఇప్పటికీ చాలా విషయాలకు ఆ సీన్‌ను, మీమ్‌ను వాడేస్తుంటారు మనవాళ్లు. అంతలా వైరల్ అయిపోయింది మరి ఆ సీన్. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ డైలాగ్‌ను, మీమ్‌ను తెగ వాడేస్తున్నారు. అయితే అది ప్రభాస్ మీద కాదు. ఆయనతో సినిమా చేసిన నిర్మాత మీద, దర్శకుడు మీద. ఆ సినిమానే ‘ఆదిపురుష్’. మన దేశంలో అత్యధిక మంది వెయిట్ చేస్తున్న సినిమాగా పేరు గాంచిన ఆ సినిమా గురించి ఇప్పుడు బజ్ లేకుండా పోయింది.
అయితే సినిమా టీమ్ మాత్రం మేం మార్చేశాం అంటున్నారు. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో రామయణాన్ని ‘ఆదిపురుష్’ పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బజ్, పోస్టర్లు లుక్లతో మంచి క్రేజ్ వచ్చింది. అయితే టీజర్ రావడం, అందులో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోవడంతో సినిమా మీద బజ్ అంతా తుస్‌మంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సినిమా అవుట్‌పుట్ విషయంలో ఇప్పుడు తాము ఎంతో ఆనందంగా ఉన్నట్లు నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు. ప్రేక్షకుల సూచనల మేరకు చిత్రానికి అవసరమైన మెరుగులద్దామని అంటున్నారు.
‘ఆదిపురుష్’ (Adipurush) సినిమా కోసం మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం, నిరాశకూ గురయ్యాం. అయితే ఆ విమర్శల నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు సినిమా రిజల్ట్ విషయంలో ఆనందంగా ఉన్నాం అని చెప్పారు. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని కూడా అన్నారు. దీంతోనే అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు ప్రేక్షకులు అంతగా మెచ్చేసుకున్న, మెచ్చేసుకుంటున్న కంటెంట్ ఏదీ టీమ్ నుండి రాలేదు. కాబట్టి ఏం చూసి బాగుంది అన్నారు అనేది తెలియడం లేదు. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా రిలీజ్ చేద్దామనుకున్నాం.
కానీ కొన్ని కారణాల వల్ల జూన్‌కు వాయిదా వేశాం. ఈ టైమ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియో వాళ్లు మరింత మెరుగ్గా పని చేశారు. భారత్‌లో ఇలాంటి సినిమా గతంలో రాలేదు. అంతర్జాతీయ సినిమాల స్థాయిలో టెక్నాలజీని మేమీ సినిమాలో వాడాం అని చెప్పారు భూషణ్ కుమార్. ఇదంతా ఓకే కానీ.. టీజర్ చూసినవాళ్లు మాత్రం మొత్తంగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మార్చడం అంత ఈజీ కాదు, ఖర్చుతో కూడుకున్న పని. దీంతో మార్చేశాం అంటే నమ్మలేం అంటున్నారు. అయితే ఎవరు చెప్పేది నిజమో తెలియాలంటే జూన్ 16 రావాలి. ఆ రోజే ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి వస్తాడు.