తెలుగు చలన చిత్ర షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు

  • June 9, 2020 / 03:55 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సినిమా షూటింగ్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి కోవిడ్ 19 మార్గదర్శకాలను అనుసరిస్తూ తక్షణమే వస్తుందని తెలియజేసినందుకు తెలుగు చనన చిత్ర నిర్మాతల మండలి తరుపున మన తెలుగు చలనచిత్ర సమస్యలను పరిష్కరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన సమర్థ న్యాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని కచ్చితంగా నమ్ముతున్నాము.

అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు సినిమా థియేటర్స్ కూడా తెరవడానికి ఆయన సమ్మతి కోరకు ఎదురుచూస్తున్నాము. అలాగే ఆయన దృష్టికి తెచ్చిన తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క ఏదైనా సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము 3 – 5 – 2020 న ఇచ్చిన మెమోరండం పై చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు. మెమరండంలో మా సినిమా యొక్క సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వచ్చాము. ఆయన ఎల్లప్పుడూ మాకు సహకరిస్తున్నారు. ఇది తెలుగు పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. మా కౌన్సిల్ యొక్క నిర్మాత సభ్యుడు అయిన జూబ్లీ హిల్స్ ఎమ్ఎల్ఏ మాగంటి గోపినాధ్ గారికి మరియు తెలంగాణ ఎఫ్డిసి ఛైర్మెన్ శ్రీ.పి.రామ్మోహన్ గారికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరిస్తు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలువుతున్నాము.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus