రాను రాను సినిమా నిర్మాతల మీద అధిక భారం పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా మీద ఉన్న అభిమానంతో ఎన్ని అధిక వ్యయాలు నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నా భరిస్తున్నారు నిర్మాతలు. అయితే.. ఈమధ్యకాలంలో స్టార్ హీరోయిన్ల అసిస్టెంట్స్ ఖర్చులు మరీ భారీగా ఉంటున్నాయని, ఇలా కొనసాగితే ఇకపై మేం సినిమాలు నిర్మించలేమని తమిళ నిర్మాతలు కొందరు వాయిస్ రైజ్ చేశారు. ముఖ్యంగా.. సమంత, తమన్నా, నయనతార వంటి సీనియర్ హీరోయిన్స్ మినిమం 7 నుంచి 10 మంది అసిస్టెంట్స్ ను మైంటైన్ చేస్తున్నారు. హెయిర్ స్టైలిస్ట్ అని, మేకప్ మెన్ అని, పర్సనల్ అసిస్టెంట్ అని.. రకరకాల మంది జనాలు హీరోయిన్ల చుట్టూ ఉంటారు. వాళ్లందరి బత్తాలు రోజుకి లక్ష దాటిపోతుందట.
హీరోయిన్లకు ఆల్రెడీ కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తుండగా.. ఇప్పుడు వాళ్ళ అసిస్టెంట్స్ కి కూడా మేమే ఖర్చు పెట్టాలంటే ఎలా అవుతుంది? అసిస్టెంట్స్ కి హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్ లో పేమెంట్ ఇచ్చుకోవాలని తమిళ నిర్మాత కె.రాజన్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా పెడతానని స్పష్టం చేశారు. మరి కౌన్సిల్ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.