Agent: అఖిల్ కోసం ఏజెంట్ నిర్మాతలు ఏం ప్లాన్ చేశారంటే..

  • February 4, 2023 / 12:22 PM IST

కింగ్ నాగార్జున రెండో కొడుకు అఖిల్ అక్కినేనిని ‘సిసింద్రీ’ తో చిన్నప్పుడే స్టార్‌ని చేసేశారు.. ‘మనం’ క్లైమాక్స్‌లో జస్ట్ అలా చూపించి.. ‘అఖిల్’ తో భారీ స్థాయిలో లాంచ్ చేశారు. తర్వాత వచ్చిన రెండు సినిమాల పరిస్థితి కూడా తెలిసిందే. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఫస్ట్ హిట్ అందుకున్నాడు. అఖిల్‌కి కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేస్తూ.. స్టార్‌గా నిలబెట్టాలనే ప్లాన్ చేస్తున్నారు నాగ్..

ప్రస్తుతం పరిశ్రమతో పాటు ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా అఖిల్ – స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిల కాంబోలో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఏజెంట్’ మీదనే ఉంది.. సరికొత్త మేకోవర్‌తో హాలీవుడ్ హీరోలా మారిపోయాడు అఖిల్.. నో డౌట్.. పక్కా హిట్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు టీమ్. ఇదిలా ఉంటే అఖిల్ బాబు తర్వాత సినిమా పలానా దర్శకుడితో చేయబోతున్నాడు అంటూ కొద్ది రోజుల నుండి వార్తలు వస్తుండడం చూశాం. వారిలో వంశీ పైడిపల్లి, బోయపాటి, మిత్రన్, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు వచ్చాయి.

అనిల్ అనే కొత్త కుర్రాణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో.. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో.. యూవీ క్రియేషన్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనుందని వార్తలు వచ్చాయి. అయితే ‘ఏజెంట్’ నిర్మాతలే అఖిల్ బాబుతో మరోసారి సినిమా ప్లాన్ చేస్తున్నారని.. ఆ ప్రాజెక్ట్ ఇదే అని కూడా అంటున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర, కింగ్ నాగార్జునకు పెద్ద ఫ్యాన్.. వాళ్ల బ్యానర్ లోగోలోనూ నాగ్ ‘శివ’ సినిమా స్టిల్ ఉంటుంది.

కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్, మలయాళంలోనూ ‘ఏజెంట్’ మూవీని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తుండగా.. సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతోంది. త్వరలో రిలీజ్ డేట్‌తో పాటు ఇతర వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus