డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు దిల్ రాజు. సొంతంగా సినిమాలు నిర్మించడంతో పాటు అప్పుడప్పుడు ఇతరులు నిర్మించిన సినిమాలను తన బ్యానర్ లో రిలీజ్ చేస్తుంటాడు. దీంతో సదరు సినిమాల్లో మినిమమ్ కంటెంట్ ఉండే ఉంటుందని అంచనాలు ఏర్పడతాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు దిల్ రాజుకి కొన్ని షాక్ లు తగులుతుంటాయి. మూడేళ్లపాటు కష్టపడి నటుడు సాగర్ నిర్మించుకున్న సినిమా ‘షాదీ ముబారక్’. రిలీజ్ కోసం ఈ సినిమాను దిల్ రాజు చేతుల్లో పెట్టారు.
ఆయన కొన్ని రీషూట్ లు చేయించి.. ప్యాచ్ వర్క్ లు చేయించి.. తన బ్యానర్ లో రిలీజ్ చేశారు. కానీ తన సొంత సినిమాలకు చేసిన రేంజ్ లో పబ్లిసిటీ చేయలేకపోయాడు. దీంతో సినిమాకి సరైన ఓపెనింగ్స్ రాలేదు. నిజానికి సినిమా చూసిన వారంతా కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని.. సెకండ్ గా పర్వాలేదనిపించిందని రివ్యూలు ఇస్తున్నారు. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ..
సరైన ప్రమోషన్స్ లేక ప్రేక్షకులకు ఈ సినిమా గురించి తెలియలేదు. ఇప్పటికైతే మౌత్ టాక్ తో సినిమాకి కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని ఆశిస్తున్నారు. వీకెండ్ లో కలెక్షన్స్ పుంజుకున్నాయని చెబుతున్నారు. కానీ కొన్ని ఏరియాల్లో సినిమాను తొలిరోజే థియేటర్ల నుండి తీసేయాల్సి వచ్చింది. సినిమాకి గనుక పబ్లిసిటీ గట్టిగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!