రాజేంద్రప్రసాద్, పోసానిలకు పృధ్వీ స్ట్రాంగ్ కౌంటర్

  • August 16, 2019 / 05:02 PM IST

ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా క్రేజ్ తగ్గే సమయానికి జగన్ ఆదుకున్నాడన్న అభిమానమో.. లేక భక్తి చానల్ కు తనను ఛైర్మన్ గా నియమించాడన్న కృతజ్ణతో తెలియదు కానీ.. జగన్ మీద ఈగ వాలినా తట్టుకోలేకపోతున్నాడు పృధ్వీ. నిన్నటివరకు జగన్ ను ఇండస్ట్రీ నుండి ఎవరు ఎందుకు విష్ చేయలేదు అని సీనియర్ ఆర్టిస్టులను, ప్రొడ్యూసర్లను కడిగిపారేసిన పృధ్వీ.. ఇప్పుడు జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తా అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తుండడం చర్చనీయాంశం అయ్యింది.

ముఖ్యంగా.. పృధ్వీ ఈ స్టెంట్ మెంట్ ను సీనియర్ యాక్టర్ రాజేంద్రప్రసాద్ మరియు జగన్ కు ఎప్పట్నుంచో సపోర్ట్ చేస్తున్న పోసానిలను ఉద్దేశించి అనడం గమనార్హం. మరి ఈ తరహా పోకడతో పృధ్వీ సినిమా ఆఫర్లు ఎలా దక్కించుకొంటాడో చూడాలి. మరి పృధ్వీ సినిమాలు కాకుండా రాజకీయాలను తన భవిష్యత్ గా భావించాడో ఏమో కానీ.. ఇలా ఇండస్ట్రీ వ్యక్తి అయ్యుండి.. ఇండస్ట్రీ వాళ్ళ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం మాత్రం బాలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus