Pulsar Bike Jhansi: పల్సర్ బైక్ ఝాన్సీ సినిమాల్లో సక్సెస్ కావడం ఖాయమేనా?

  • November 25, 2023 / 04:30 PM IST

టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న వాళ్లలో పల్సర్ బైక్ ఝాన్సీ ఒకరు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానెల్ లోని కొన్ని ఈవెంట్ల ద్వారా పల్సర్ బైక్ ఝాన్సీకి ఊహించని స్థయిలో గుర్తింపు వచ్చింది. అయితే ఝాన్సీ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఉక్కు సత్యాగ్రహం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో ఝాన్సీ నటిస్తున్నారని తెలుస్తోంది. సత్యారెడ్డి కథానాయకుడిగా స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రజా గాయకుడు గద్దర్ కు ఈ సినిమా చివరి సినిమా కావడం గమనార్హం. ప్రజల సమస్యలను తెలిపే మంచి సినిమా కావడం వల్లే ఈ సినిమాలో తాను నటించానని ఝాన్సీ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ట్రైలర్, పాటలను గద్దర్ కూతురు వెన్నెల రిలీజ్ చేశారు.

ఝాన్సీ భవిష్యత్తులో కమర్షియల్ అంశాలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తే ఆమె కెరీర్ మరింత పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఉక్కు సత్యాగ్రహం సినిమాకు ఝాన్సీ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఝాన్సీకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఝాన్సీ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.

ఝాన్సీ డాన్సింగ్ స్కిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఝాన్సీకి ఉన్న క్రేజ్ వల్ల ఉక్కు సత్యాగ్రహం సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయేమో చూడాల్సి ఉంది. పల్సర్ బైక్ ఝాన్సీకి సినిమా ఆఫర్లు ఎక్కువగానే వస్తున్నా వచ్చిన ప్రతి కథకు ఓకే చెప్పకుండా మంచి కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. (Pulsar Bike Jhansi) ఝాన్సీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus