Puneeth Rajkumar: యష్ తో పునీత్ డాన్స్.. వీడియో వైరల్!

  • October 30, 2021 / 11:07 AM IST

కన్నడ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ ని దేవుడిలా కొలుస్తుంటారు. ఆయన తనయుడు పునీత్ రాజ్ కుమార్ తండ్రి లెగసీను కాపాడడంతో పాటు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇక లేరనే విషయాన్నీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రయివేట్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి.. విక్రమ్ హాస్పిటల్ కి తరలించగా.. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని ఆయన సడెన్ గా హార్ట్ ఎటాక్ తో చనిపోవడంతో సంచలనంగా మారింది. రెండు రోజుల క్రితమే ఆయన ఓ ఈవెంట్ లో కన్నడ స్టార్ యష్ తో కలిసి డాన్స్ చేశాడు. శివరాజ్ కుమార్ హీరోగా ఏ.హర్ష తెరకెక్కించిన సినిమా ‘జై భజరంగీ 2’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దానికి పునీత్ రాజ్ కుమార్ తో పాటు కన్నడ స్టార్ హీరో యష్ కూడా వచ్చాడు.

ఈ సందర్భంగా స్టేజ్ పై శివరాజ్ కుమార్, యష్ లతో కలిసి పునీత్ రాజ్ కుమార్ కూడా డాన్స్ చేశాడు. ఈ ముగ్గురూ స్టార్ హీరోలు అయినప్పటికీ.. ఒకరి సినిమా ఈవెంట్ కి మరొకరు రావడం.. ప్రమోషన్స్ కి సయాం చేయడంతో అభిమానులు ఆనందపడ్డారు. స్టేజ్ పై ఎంతో యాక్టివ్ గా కనిపించిన పునీత్ కి ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ రావడం.. ఆయన మరణించడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శివరాజ్, యష్, పునీత్ కలిసి చేసిన డాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus