నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా భారీ బడ్జెట్ తో ‘ఇజమ్’ సినిమాను తెరకెక్కించాడు పూరీ. అయితే కధ ఎలా ఉన్నా….కధనంతో, హీరోయిజన్ని ఎలివేట్ చేస్తూ…స్క్రీన్ప్లే ని పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు పూరీ. అదే క్రమంలో చోటా మోటా హీరోలను కూడా టాప్ హీరోల్లా చేసిన ఘనత సైతం పూరికి దక్కుతుంది…మరి ఏమయిందో…ఏమో కానీ…అనుకోకుండా పూరీ ట్రాక్ తప్పాడు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది….కధను…కధనాన్ని కలిపి నడిపిస్తూ స్టోరీ లోని కీ పాయంట్ ను చివర్లో రీవీల్ చేస్తాడు….అయితే ఇజమ్ లో మాత్రం పూరీ మార్క్ డైరెక్షన్ ఎక్కడా కనిపించలేదు అన్న వాదన వినిపిస్తుంది….తీసుకున్న కంటెంట్ మంచిదే కాని దాన్ని తెరకెక్కించే మార్గంలో రొటీన్ ఫార్ములాతో పూరి తన మీద ఉన్న బెస్ట్ ఇంప్రెషన్ ను పోగొట్టుకునేలా చేశాడు అని టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న వార్త.
కేవలం హీరోలను మాత్రమే స్టైల్ గా చూపించి సినిమాలను హిట్ కొట్టేయొచ్చు అన్న ఆలోచనతోనే ఎన్నాళ్లు పూరీ ఇలానే సినిమాలు తీసుకుంటూ వెళ్తాడో ఆయనకే తెలియాలి. అదే క్రమంలో సినిమా మొత్తం చాలా బోరింగ్ గా అనిపించడమే కాకుండా….సినిమాలో సూపర్ సీన్స్ ఏమీ లేకపోవడం….ఒక్క లాస్ట్ కోర్ట్ సీన్ కి మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ కావడం…పైగా ఆ ఒక్క సీన్ కోసం 2గంటల సినిమాను భరించాలా అన్నంత బాధ ప్రేక్షకుల్లో కలగడం చూస్తూ ఉంటే….ఇజమ్ ను పూరీ పూర్తిగా ట్రాక్ తప్పి తీశాడు అని ఇట్టే అర్ధం అయిపోతుంది…ఏది ఏమైనా…మొత్తానికి పూరీ కల్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఓమ్ము చేశాడు అనే చెప్పాలి.