మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస విజయాలతో జోరుమీదున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన ఆచార్య రిలీజ్ డేట్ గురించి త్వరలో స్పష్టత రానుంది. ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ ఊటీలో మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం పూరీ జగన్నాథ్ కూడా పని చేశారని చిరంజీవికి తగిన విధంగా పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథలో స్వల్పంగా మార్పులు చేశారని తెలుస్తోంది.
పూరీ జగన్నాథ్ చెప్పిన సలహాలు, సూచనలు నచ్చడంతో మోహన్ రాజా స్క్రిప్ట్ లో మార్పులు చేశారని సమాచారం. పూరీ జగన్నాథ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలో మాస్ సీన్స్ ఉండేలా మార్పులు చేశారని తెలుస్తోంది. చిరంజీవిని ప్రేక్షకులు ఏ విధంగా చూడాలని అనుకుంటారో ఆ విధంగా ఈ సినిమాలో తెరపై చూడవచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని గాడ్ ఫాదర్ మేకర్స్ భావిస్తున్నారు.
చిరంజీవి ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ ను మార్చుకున్నారు. తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేశారు. పలువురు మెగా హీరోలతో పని చేసిన పూరీ జగన్నాథ్ చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు పని చేయలేదు. చిరంజీవి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో, మెహర్ రమేష్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!