Puri Jagannadh: పూరి జగన్నాథ్ వాయిస్ ట్వీట్… అతని కోసమేనా!
June 25, 2022 / 09:51 PM IST
|Follow Us
‘చోర్ బజార్’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు, లేదంటే చదివే ఉంటారు. ఆకాశ్ తండ్రి పూరి జగన్నాథ్‌ని, కొంతమంది హీరోలను, ఇంకొంతమంది వేరేవారిని ఆయన ఉద్దేశిస్తూ చాలా వ్యాఖ్యలే చేశారు. దీనిపై బండ్ల గణేశ్‌ను సపోర్టు కొంతమంది, అపోజ్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా పూరి జగన్నాథ్ కూడా ఇలాంటిదే ఓ పని చేశారా? ఆ మాటలు వింటుంటే అదే అనిపిస్తోంది.
పూరి మ్యూజింగ్స్ పేరుతో పూరి జగన్నాథ్ గత కొన్ని నెలలుగా ఆయన మనసులోని భావాలను, ఆయన సిద్ధాంతాలను వివరిస్తూ వస్తున్నారు. పాడ్‌కాస్ట్‌గా మొదలైన ఈ సూక్తులు, మంచి మాటలు, ఆలోచనల ప్రవాహం ఆ తర్వాత యూట్యూబ్‌కి కూడా వచ్చింది. ఇందులో తాజాగా పూరి ఓ షార్ట్ వీడియోను షేర్ చేశారు. టంగ్.. అంటూ నాలుక గురించి కొన్ని ఆసక్తికర వివరాలు చెప్పారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఇది బండ్ల గణేశ్ రీసెంట్ వ్యాఖ్యలకు కౌంటర్ అని నెటిజన్లు అంటున్నారు.
‘‘గుర్తు పెట్టుకోండి మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే జీవితంలో ఎక్కువసేపు మనం వింటూ ఉండాలి. అదే మంచిది. ఫ్యామిలీ మెంబర్స్ కావొచ్చు, మీ ఫ్రెండ్స్ కావొచ్చు, ఆఫీస్ మెంబర్స్ కావొచ్చు, ఆఖరికి కట్టుకున్న భార్య దగ్గర కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా ప్రవర్తించొద్దు. మన వాగుడు మన కెరీర్‌ను, క్రెడిబులిటీని డిసైడ్ చేస్తుంది. మీరు వినే ఉంటారు సుమతీ శతకం. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ’ అని.
తప్పు మాట్లాడటం కంటే నాలుక కొరికేసుకోవడం మంచిది అని మాటల గురించి చెప్పిన పూరి. చివరగా ఒక మాట అంటూ. ‘నీ లైఫ్, నీ డెత్.. నీ టంగ్ మీద ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు. ఇదంతా వింటుంటే నెటిజన్ల కామెంట్లు కరెక్ట్ అనుకోవాలి. అయితే పూరి నార్మల్‌గా ఈ మాటలు అన్నారా అని ఆలోచిస్తే.. ఇటీవల కాలంలో పూరి మ్యూజింగ్స్ రావడం లేదు. ఇప్పుడేదో అర్జంట్ చిన్న బిట్ రికార్డు చేసి షార్ట్ వీడియో వదిలేరు. ఏమో ఆయన చెబితేనే క్లారిటీ. లేదంటే బండ్ల గణేశ్ స్పందిస్తే క్లారిటీ రావొచ్చు.