ఆ రేంజ్ టికెట్ రేట్లతో మూడు సినిమాలను ప్రేక్షకులు చూస్తారా?
July 23, 2024 / 11:24 AM IST
|Follow Us
ఈ ఏడాది డిసెంబర్ నెల 6వ తేదీన పుష్ప ది రూల్, డిసెంబర్ 20వ తేదీన గేమ్ ఛేంజర్, 2025 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన విశ్వంభర సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా బన్నీ (Allu Arjun) కూడా మెగా హీరోనే అని పుష్ప2 (Pushpa 2) రిలీజ్ సమయానికి చిన్నచిన్న సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే పుష్ప2, గేమ్ ఛేంజర్ (Game Changer) , విశ్వంభర (Vishwambhara) ఐదు వారాల్లో రిలీజ్ కానుండటం సరైన నిర్ణయమేనా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక పాన్ ఇండియా సినిమా సరికొత్త రికార్డ్స్ సాధించే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవాలంటే కనీసం 4 వారాల పాటు థియేటర్లలో రన్ కావాల్సి ఉంటుంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉంటే ఒక సినిమా ఎఫెక్ట్ మరో సినిమాపై పడుతుంది.
గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదలైనా సంక్రాంతి పండుగ సమయంలో కొన్ని థియేటర్లు అయినా ఈ సినిమాకు కేటాయించాల్సి ఉంటుంది. మూడు సినిమాలు భారీ సినిమాలు కావడంతో ఏపీ ప్రభుత్వం , తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ సినిమాలకు టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అనుమతులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెగా ఫ్యాన్స్ మూడు సినిమాలను థియేటర్లలో చూడటం సులువు కాదని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పెరిగిన టికెట్ రేట్లతో నెలకు ఒక సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూడటమే భారమని చాలామంది ఫీలవుతున్నారు. మరోవైపు డిసెంబర్, జనవరి నెలల్లో ఇతర హీరోల సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్, 2025 జనవరి కానుకగా విడుదలయ్యే సినిమాల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.