Pushpa Movie: ‘పుష్ప ది రైజ్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
December 17, 2021 / 06:20 PM IST
|Follow Us
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ పేరుతో పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదల కాబోతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘ముత్తంశెట్టి మీడియా’ సంస్థతో కలిసి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు.. టీజర్, ట్రైలర్లు వంటివి సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి. దీంతో బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది.
ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
40.00 cr
సీడెడ్
18.00 cr
ఉత్తరాంధ్ర
12.50 cr
ఈస్ట్
8.00 cr
వెస్ట్
7.00 cr
గుంటూరు
9.00 cr
కృష్ణా
7.50 cr
నెల్లూరు
4.00 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
106.00 cr
తమిళ్ నాడు
5.50 cr
కేరళ
4.00 cr
కర్ణాటక
9.00 cr
నార్త్ ఇండియా (హిందీ)
8.00 cr
ఓవర్సీస్
13.00 cr
టోటల్ వరల్డ్ వైడ్
145.50 cr
‘పుష్ప ది రైజ్’ కి రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. అల్లు అర్జున్ గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాన్ ఇండియా మూవీ కాకపోయినప్పటికీ రూ.160 కోట్ల పైనే షేర్ ను నమోదు చేసింది. పాజిటివ్ టాక్ కనుక వస్తే ‘పుష్ప’ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.