Pushpa First Song: పుష్ప ఫస్ట్ సాంగ్ కావాలనే లీక్ చేశారా?
August 12, 2021 / 11:00 PM IST
|Follow Us
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ప్రతిసారి పెద్ద సినిమాలకు ఎలాగైతే లీకుల గండం ఉంటుందో ఇప్పుడు పుష్పపై కూడా అలాంటి ప్రభావమే పడింది. సినిమా మొదటి పాటను గ్రాండ్ గా విడుదల చేయాలని ఈ నెల 13న డేట్స్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎలా లీక్ అయ్యిందో తెలియదు గాని పాట ఫస్ట్ సాంగ్ మొత్తం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దాక్కో దాక్కో మేక, పులొచ్చి కోరుకుద్ధి పీక అనే ఈ పాటను ఒకేసారి ఐదు భాషల్లో ఐదుగురు డిఫరెంట్ సింగర్స్ తో పాడించారు. అయితే తెలుగు సంబంధించిన పాట ఒకరోజు ముందుగానే ఇంటర్నేట్ వరల్డ్ లో వైరల్ గా మారింది. అయితే లీక్ అయిన పాటను గమనిస్తే అది ఒరిజినల్ కాదని అర్ధమవుతోంది. ఎందుకంటే లీక్ అయిన దాంట్లో దేవిశ్రీప్రసాద్ వాయిస్ ఉంది. ఒరిజినల్ గా ఆ పాటను పాడింది సింగర్ శివమ్.
ముందు టెస్టింగ్ కోసం నార్మల్ గా అన్ని పాటలను దేవిశ్రీప్రసాద్ పాడేసి రెడీ చేసుకుంటాడు. ఆ తరువాత దాన్ని సింగర్స్ కు వినిపించి మరొక తరహాలో పాడిస్తాడు. ఇక దేవి పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అది కూడా జస్ట్ రికార్డు చేసింది కాబట్టి ఒరిజినల్ సాంగ్ పై పెద్దగా ప్రభావం పడదు. ఇక ఈ సాంగ్ ను ప్రమోషన్ లో భాగంగా ముందే లీక్ చేసి ఉంటారనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఫైనల్ గా ఈ పాట ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి.