Pushpa OTT Date: పుష్ప ఓటీటీలోకి ఎప్పుడు రాబోతోందంటే?
December 18, 2021 / 02:46 PM IST
|Follow Us
స్టైలిష్ స్టార్ నుంచి స్టార్ గా తన బ్రాండ్ మార్చుకున్న అల్లు అర్జున్ ఈసారి పుష్ప సినిమాతో బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బన్నీ మొదటి పాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లోనూ భారీగానే విడుదల అయ్యింది. ఇక విడుదల సమయంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా సినిమాకు ఓ వర్గం నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉండటం తో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ డోస్ ఇంకా పెంచాలని చూస్తున్నారు.
అయితే సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఓటీటీలో విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసినట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అమెజాన్ ప్రైమ్ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా కలెక్షన్స్ నాలుగు వారాల తర్వాత తగ్గితే నాలుగు వారాల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అసలైతే యాభై రోజుల తర్వాత ఏ సినిమా అయినా సరే ఓటీటీలో విడుదల అవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలతో ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. కానీ కలెక్షన్స్ తగ్గితే మాత్రం ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. మరియు పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 35 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి మొదటిరోజు 63 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను 180కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం.