Pushpa Movie Songs: ‘పుష్ప’పై ‘రంగస్థలం’ ఎఫెక్ట్… కారణమెవరు?
October 27, 2021 / 12:42 PM IST
|Follow Us
ఓ సినిమా హిట్ అయితే… ఆ ఎఫెక్ట్ ఆ తర్వాతి సినిమాకు కూడా ఉంటుంది అంటారు. గతంలో చాలామంది దర్శకులు, హీరోలు ఇలా గత సినిమాల ప్రభావంతో ప్రజెంట్ సినిమాను ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. అలాంటి ప్రభావంతో సుకుమార్ ఇప్పుడు ఆలోచిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. మీరు అనుకుంటున్నట్లు… ఇదంతా ‘పుష్ప’ సినిమా గురించే. ఈ సినిమా పార్ట్ 1కి సంబంధించి ఒక్కో సింగిల్ విడుదల చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ‘రంగస్థలం’ ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయనేది నెటిజన్ల వాదన.
‘పుష్ప’ సినిమా నేపథ్యం గ్రామీణం అని కొత్తగా చెప్పక్కర్లేదు. అంతేకాదు సినిమాలో పాత్ర చిత్రణల విషయంలోనూ పోలికలు కనిపిస్తున్నాయి. చిట్టిబాబు ఇక్క పుష్పరాజ్ అయితే, రామలలక్ష్మి ఇక్కడ శ్రీవల్లి అయ్యింది అంటున్నారు. అంతేకాదు ఇప్పటివరకు వచ్చిన పాటల విషయంలోనూ కొన్ని పోలికలు కనిపిస్తున్నాయట. మూడు పాటలకూ రంగస్థలంలోని మూడు పాటలను బేరీజు వేసి మరీ చెబుతున్నారు నెటిజన్లు. ‘దాక్కో దాక్కో మేక…’ పాట బాగునప్పటికీ… ‘ రంగా రంగ రంగస్థలానా…’ ఫ్లేవర్ కనిపిస్తోందనేది నెటిజన్ల వాదన.
‘శ్రీవల్లీ…’ పాట చూస్తే… ‘ఎంత సక్కగున్నావే…’ పాట కచ్చితంగా గుర్తొస్తుంది. ఇది చాలామంది మాట. ఇప్పుడు విడుదలవుతున్న మూడ పాట ‘ నా సామీ…’ విషయంలోనూ ఇదే పంచ్‌లు పేలుతున్నాయి. ‘రంగస్థలం’లోని ‘రంగమ్మా… మంగమ్మా…’ పాటలా ఉందే అని ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.