Pushpa, KGF: ‘పుష్ప’ దూకుడికి ‘కెజిఎఫ్’ బ్రేకులు!

  • August 18, 2021 / 02:00 PM IST

అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ కి అందరిలో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తన ఫస్ట్ మూవీ ఆర్య ని అల్లు అర్జున్ తో తీసి సూపర్ హిట్ కొట్టిన సుకుమార్ ఆ తరువాత దానికి కొనసాగింపుగా ఆర్య 2 తీశారు, అయితే ఆ మూవీ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల రంగస్థలం మూవీతో సుకుమార్, అలానే అటు అలవైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ ఇద్దరూ కూడా సూపర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ మూవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులు గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ప్రీ లూడ్ టీజర్ తోపాటు, దాక్కో దాక్కో మేక లిరికల్ సాంగ్ మంచి స్పందన అందుకున్నాయి. నిజానికి ఈ సినిమాని మొదట ఈ ఏడాది ఆగష్టు 13న విడుదల చేయాలని భావించారు.

అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూవీ వాయిదా పడింది. ఇక ఇటీవల పుష్ప పార్ట్ 1 ని క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం పుష్ప రిలీజ్ అయిన కేవలం ఒక వారం గ్యాప్ తరువాత కెజిఎఫ్ చాప్టర్ 2 కూడా విడుదల కానున్నట్లు టాక్. పుష్ప డిసెంబర్ 14న అలానే కెజిఎఫ్ చాప్టర్ 2, 21న విడుదల కానుందని, పుష్ప బాక్సాఫీస్ దూకుడు కి ఒక వారం తరువాత కెజిఎఫ్ రూపంలో దెబ్బపడనుందని సమాచారం. కాగా పక్కగా ఈ న్యూస్ నిజమో కాదో తెలియాలి అంటే రెండు సినిమాల యూనిట్స్ నుండి అధికారికంగా విడుదల తేదీలకు సంబంధించి న్యూస్ బయటకు రావాలి. మరి అప్పుడు ఆర్య 2 తో ఫ్లాప్ అందుకున్న అల్లు అర్జున్, సుకుమార్ ఈసారి పుష్ప తో హిట్ కొడతారో లేదో చూడాలి…!!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus