టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ హిందీలో విడుదలై 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. బన్నీ బాలీవుడ్ లో ఈ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదు. పుష్ప ది రైజ్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తక్కువ రేటుకే హిందీలో విక్రయించారు. అయితే పుష్ప ది రూల్ హక్కుల కోసం హిందీలో ఊహించని స్థాయిలో పోటీ నెలకొంది.
అయితే పుష్ప2 సినిమాతో 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. పుష్ప ది రైజ్ వల్ల బాలీవుడ్ లో బన్నీ పేరు మారుమ్రోగింది. పుష్ప ది రైజ్ రిలీజైన సమయంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగాయి. కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో లేకపోతే పుష్ప కలెక్షన్లు మాత్రం మరింత ఎక్కువగా ఉండేవని చెప్పవచ్చు. బాహుబలి పార్ట్1 తో పోల్చి చూస్తే బాహుబలి2 అంచనాలకు మించి కలెక్షన్లు సొంతం చేసుకుంది.
పుష్ప ది రూల్ తో బన్నీ బాహుబలి మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో పుష్ప ది రూల్ తెరకెక్కనుందని సమాచారం. పుష్ప ది రూల్ పారితోషికాల కోసమే మేకర్స్ 90 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు కూడా పెరుగుతాయి.
బాహుబలి2 హిందీ వెర్షన్ 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లతో అరుదైన రికార్డును సొంతం చేసుకోగా బన్నీ ఆ రికార్డును బ్రేక్ చేస్తారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. పుష్ప ది రైజ్ హిందీ హక్కులు కొనుగోలు చేసిన మనీష్ షా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో పుష్ప ది రూల్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!