Raashi Khanna: థాంక్యూ లో రొమాంటిక్ సన్నివేశాలు..రాశీ ఏమందంటే?
July 21, 2022 / 06:15 PM IST
|Follow Us
రాశీ ఖన్నా, నాగ చైతన్య జంటగా గతంలో మనం, వెంకీ మామ సినిమాల్లో నటించారు.ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ‘థాంక్యూ’ లో కలిసి నటించారు. గత రెండు చిత్రాల్లో నాగ చైతన్య,రాశీ ఖన్నా ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు లేవు. అయితే థాంక్యూ లో మాత్రం వీళ్ళ మధ్య రొమాన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుందట. మెయిన్ గా అదే హైలెట్ కానుందని తెలుస్తోంది. ముద్దు సీన్లు కూడా ఓ రేంజులో ఉన్నాయని టాక్ నడుస్తుంది.
రాశీ ఖన్నా ముద్దు సన్నివేశాల్లో నటించడం కొత్తేమీ కాదు.విజయ్ దేవరకొండతో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో అయితే హద్దులు మీరు ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించింది. తర్వాత అవి ఇష్టంతో చేసినవి కాదు అంటూ సైడ్ ట్రాక్ కు ఎక్కించింది. అయితే చైతన్యతో మరీ అంతా ఘోరంగా ఉండదు కానీ వీళ్ళ రొమాంటిక్ ట్రాక్ మాత్రం హైలెట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఇక ముద్దు సీన్ల విషయంలో రాశీ ఖన్నా మాట్లాడుతూ..
“ముద్దు సీన్లకు నేను అతీతం కాదు. రొమాంటిక్ సన్నివేశాల్లో అవి సహజం. ‘థాంక్యూ’లో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి కానీ అవి అతిగా ఉండవు. నేను ఇప్పటివరకు చేసిన ఇతర సినిమాల్లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. హాట్ హాట్ గా ఉన్నాయి..రాశీ రెచ్చి పోయి చేసింది అంటూ జరుగుతున్న ప్రచారం తప్పు,” అంటూ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. దిల్ రాజు సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు హద్దులు మీరి ఉండవు, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో దిల్ రాజు సినిమాలకు ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది అంటూ సినీ ప్రముఖులు కూడా ఈ సన్నివేశాల గురించి చెప్పుకొస్తున్నారు.