స్పెషల్ సాంగ్ కోసం రెమ్యునరేషన్ తీసుకోని హీరోయిన్!
September 16, 2017 / 11:31 AM IST
|Follow Us
ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా నటించిన తాజా చిత్రం “జై లవకుశ” మరో ఐదురోజుల్లో థియేటర్లోకి రానుంది. ఓ వైపు హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకున్నప్పటికీ రవితేజ మూవీ “రాజా ది గ్రేట్” చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది. ఈ బ్యూటీ తొలిసారి ప్రత్యేక పాటలో డ్యాన్స్ చేయడంతో దానిపై క్రేజ్ ఏర్పడింది. ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఎంత మొత్తం అందుకుందోనని గుసగుసలు మొదలయ్యాయి. ఇదే విషయాన్నీ ఓ రిపోర్టర్ ఆమె ముందు ఉంచగా.. దీనిపై రాశీ ఖన్నా క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్ కోసం రెమ్యునరేషన్ తీసుకోలేదని స్పష్టం చేసింది. “రాజా ది గ్రేట్” దర్శకుడు అనిల్ రావిపూడి తనకు మంచి స్నేహితుడని అతడి కోసమే రూపాయి కూడా తీసుకోకుండా ఆ సాంగ్ చేశానని వెల్లడించింది.
అనిల్ రావిపూడి డైరక్షన్లో రాశీ ఖన్నా “సుప్రీమ్” చేసింది. అందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆఫర్లు సైతం వచ్చాయి. ఆ కృతజ్ఞతతో ఈ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. రాశీ ఖన్నా చేసిన సాంగ్ రాజా ది గ్రేట్ చిత్రానికి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.