రవితేజ కోసం రాశీఖన్నా బికినీ!

  • January 18, 2018 / 03:21 AM IST

పరిచయమైన కొత్తలో బొద్దుగా, ముద్దుగా ఉన్న రాశీఖన్నాను చూసి అందరూ “భలే ఉంది” అనుకొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు సినిమా కౌంట్ తోపాటుగా వెయిట్ కూడా పెరిగిపోయింది పాప.. ఇలా అయితే కష్టమనుకొన్నారు. కట్ చేస్తే.. కొన్నాళ్లు సినిమాల స్పీడ్ తగ్గించి కొవ్వు కరిగించడం, షేప్ పై కాన్సన్ ట్రేట్ చేసింది. కాస్త లేట్ అయినా మొత్తానికి అనుకొన్నది సాధించి మరీ జీరో సైజ్ కాకపోయినా సన్నబడింది. అలాగే అమ్మడు ఇప్పటివరకూ ఏ సినిమాకి కూడా గ్లామర్ డోస్ పరంగా పరిమితులు పెట్టలేదు. అందువల్లే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రాశీ అందాలు మాత్రం అందర్నీ బాగా ఆకట్టుకొనేవి.

అయితే.. బాగా సన్నబడిన తర్వాత రాశీఖన్నా గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం “టచ్ చేసి చూడు”లో అమ్మడు టూ పీస్ బికినీ వేయడంతోపాటు.. రవితేజతో హాట్ హాట్ కిస్సింగ్ ఎపిసోడ్ లోనూ రెచ్చిపోయిందట. ఇటీవల విడుదలైన సాంగ్ ప్రోమోలో రాశీఖన్నా బికినీ, లిప్ లాక్ చూసినవాళ్ళందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బీచ్ లో పరిగెడుతున్న రాశీ ఆరబోస్తున్న అందాలను ఆస్వాదించలేక యువత కూడా ఇబ్బందిపడిపోతున్నారు. చూస్తుంటే.. “టచ్ చేసి చూడు”తో రాశీఖన్నా యువహృదయాల్లో మంటలు పుట్టించేలా ఉంది. ఈ సినిమాలో మరో హాట్ హీరోయిన్ సీరత్ కపూర్ కూడా ఉన్నప్పటికీ.. ఆమెను రాశీ తన గ్లామర్ తో పూర్తిగా డామినేట్ చేసేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus