ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే కొన్ని నియమాలు పాటించాలి!
August 7, 2018 / 08:12 AM IST
|Follow Us
హీరోయిన్ అవ్వాలంటే గ్లామర్, అదృష్టం ఉంటే సరిపోద్దన్నమాట ఎంత నిజమో.. హీరోయిన్ గా నెగ్గుకురావాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలన్న విషయం కూడా అంతే వాస్తవం. ఒక్కోసారి అవకాశం దక్కించుకోవడం కంటే.. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడం చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడే హీరోయిన్ టాలెంట్ ఏమిటనేది బయటపడుతుంది. అయితే.. రాశీఖన్నా ఈ విషయంలో పీజీ చేసినట్లుంది. అందుకే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు.. నటిగా తన స్టాయిని ప్రతి సినిమాతో పెంపోందించుకుంటూ దూసుకుపోతోంది రాశీఖన్నా. తాజాగా “శ్రీనివాస కళ్యాణం” ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ తన సక్సెస్ సీక్రెట్ ఏమిటనేది చెప్పుకొచ్చింది.
“బేసిగ్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రెండు రూల్స్ పెట్టుకొన్నాను. ఒకటి ఏ భాషలో నటిస్తే ఆ భాష నేర్చుకోవాలి. రెండోది నా పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. అందుకే నేను నటించే సినిమాలో కంటెంట్ తో సంబంధం లేకుండా బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాను. అలాగే.. ఆల్రెడీ తెలుగు నేర్చుకున్నా, ప్రస్తుతం తమిళం నేర్చుకుంటున్నాను. భాష అర్ధమవ్వకపోతే.. సరైన భావం పలికించలేమ్. అందుకే కష్టపడి భాషలు నేర్చుకొంటాను. నా సక్సెస్ సీక్రెట్స్ ఇవే” అంటూ సమాధానమిచ్చింది రాశీఖన్నా.